విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి

Sep 25 2025 7:07 AM | Updated on Sep 25 2025 7:07 AM

విద్య

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి

ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ

దరఖాస్తు గడువు పొడిగింపు

ఒంగోలు సిటీ: 2026–27 విద్యా సంవత్సరంలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9,11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్‌ 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ సి.శివరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 8, 10 తరగతి చదువుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అప్లికేషన్‌ కావాల్సిన వారు నేరుగా సంప్రదించాలన్నారు.

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద వాహనాల నిలిపివేత

3 గంటల పాటు నిలిచిన వాహనాలు

గిద్దలూరు రూరల్‌: నల్లమల ఘాట్‌రోడ్డులో భారీ క్రేన్‌తో వెళుతున్న లారీ నిలిచిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని దిగువమెట్ట సమీపంలోని బెంగళూరు నుంచి విజయవాడకు భారీ క్రేన్‌తో వెళుతుండగా నల్లమల ఘాట్‌ రోడ్డులో బుధవారం భారీ క్రేన్‌తో వెళుతున్న ఓ లారీ సాంకేతిక మరమ్మతులతో ఆగిపోయింది. దీంతో దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్లే వాహనాలను దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. భారీ క్రేన్‌తో నిలిచిపోయిన లారీని బాగు చేయించి రోడ్డుకు అడ్డం లేకుండా పక్కకు తీయించారు. రోడ్డుపై వాహనాలు కిలో మీటరు మేర నిలిచిపోయాయి. సుమారు 3 గంటల పాటుగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముగిసిన కబడ్డీ శిక్షణ శిబిరం

ఒంగోలు సిటీ: జిల్లా అండర్‌–18 కబడ్డీ జట్టుకు స్థానిక క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ బుధవారంతో ముగిసింది. విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ, మెళకువలు నేర్పించినట్లు ప్రకాశంజిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.భాస్కర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు వసతి, సౌకర్యాలు కల్పించినందుకు క్విస్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నిడమానూరి సూర్య కల్యాణ్‌ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ గాయత్రిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎస్‌ రంగారావు, కార్యదర్శి వై. పూర్ణచంద్రరావు, కోశాధికారి డి.రమేశ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సీనయ్య పాల్గొన్నారు. వినోద్‌, సుప్రజ, భవాని తదితరులు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ అందించారు.

వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ హరిబాబు

ఒంగోలు సిటీ: విద్యార్థులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సమావేశం హాలులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం 1969 సెప్టెంబర్‌ 24వ తేదీన ఏర్పాటైందని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఒక గొప్ప వాలంటరీ సంస్థ అని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఇటువంటి సంస్థ ద్వారా భారతదేశంలో వైద్య ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు, మొక్కల పెంపకం, పచ్చదనం–పరిశుభ్రత, జాతీయ సమైక్యత, మహిళా చైతన్యం, ప్రకతి వైపరీత్యాల సమయంలో సేవా కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నిర్మూలన, నేత్రదాన శిబిరాలు వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, యాంటీ డ్రగ్స్‌, యాంటీ ర్యాగింగ్‌ కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు కావడం హర్షించదగిన విషయమని అన్నారు. కార్యక్రమానికి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మండే హర్ష ప్రీతం దేవ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు.

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి 1
1/2

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి 2
2/2

విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement