
బాబు మోసాలను ఎండగడదాం
కొత్తపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మండిపడ్డారు. మండలంలోని పిన్నింటివారిపాలెం, గుండమాల, మోటుమాల గ్రామాల్లో బుధవారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 కాలేజీలను నిర్మాణం ప్రారంభించారన్నారు. ఆ కాలేజీల ద్వారా ఏటా 5 వేల మంది డాక్టర్లు వైద్యులు బయటకు వస్తే ఎంతో మంది భవిష్యత్ మారుతాయన్నారు. కాలేజీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వంకాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో లక్షల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఇవ్వకపోవడంతో నిర్వీర్యమవుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్ సెంటర్లు నిర్మించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారన్నారు. పోర్టులు, ఫిష్షింగ్ హార్బర్లు నిర్మించారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్ సీపీ హయాంలో పాలన సాగిందన్నారు. కానీ కూటమి అధికారంలోకి అవినీతి, అక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా మహిళల ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మత్స్యకారుల సంక్షేమానికీ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా కూడా కొంతమందికి అందలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మండలంలో రూ.21 కోట్లతో విద్యుత్ లైన్లు, స్తంభాల ఆధునికీకరణ చేశామన్నారు. గుండమాల గ్రామస్తులకు సాగు భూముల పట్టాలు, గుండమాలలో వేటకు వెళ్లి మరణించిన యానాది కుటుంబానికి మత్స్యకార ఇన్సూరెన్సు కింద రూ.10 లక్షలు ఇచ్చామని గుర్తు చేశారు. అనంతరం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, సైకం రాంబాబు, గుండమాల, మోటుమాల సర్పంచ్‌లు కారాని జయరావు, కోడూరి గోపిరెడ్డి, వెంకటరెడ్డి, గాలి ముసలారెడ్డి, మల్లికార్జున, వెంకటనారాయణ, అప్పాడి సురేష్, గొల్లపోతు వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కాలు విఫలం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు
బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు