కూటమి దొంగలు | - | Sakshi
Sakshi News home page

కూటమి దొంగలు

Sep 23 2025 10:52 AM | Updated on Sep 23 2025 10:52 AM

కూటమి

కూటమి దొంగలు

తరలిపోతున్న తెల్లరాయి..

కొండ కలప, కర్రను కొట్టేస్తున్నారు యథేచ్ఛగా అటవీ భూముల్లో తెల్లరాయి, మట్టి తవ్వకాలు అక్రమ దందాలో అన్ని శాఖల అధికారులకు వాటా ! సీఎస్‌పురం మండలంలో ఇద్దరు ఫారెస్ట్‌ అధికారులు సస్పెన్షన్‌ పై స్థాయికి ఫిర్యాదులు వెళ్తే.. నామ్‌కే వాస్తే దాడులు

కారడవిలో

కనిగిరిరూరల్‌:

ష్టారీతిగా సహజ వనరులను దోచుకుంటూ అధికార పార్టీ నేతలు సంపద సృష్టించుకుంటున్నారు. నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులో ఉంటుంది. నల్లమల అడవిలోని భైరవకోన బీట్‌, అంబవరం బీట్‌లలో జోరుగా కలప (జానా, ఇల్లూరు, కోయ, ఊటీ, చీమచింత, మర్రి, జామాయిల్‌, చిల్ల, ఇలా పలు రకాల జాతి కర్రలు), కొండ కర్రలను యథేచ్ఛగా కొట్టి తరలిస్తూ.. కూటమి నేతలు లక్షలు గడిస్తున్నారు. కొద్ది కాలం క్రితం భైరవకోన కొండ అటవీ ప్రాంతంలో తుంగోడు, మైలుచర్ల, దేవకిమర్రి కొండల్లో ఎర్రచందనం కర్రను తరలించేందుకు సిద్ధంగా ఉంచగా.. దాడులకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో అవి ఫారెస్ట్‌ పరిధిలో లేవంటూ రాత్రి రాత్రికి గప్‌చుప్‌గా వెనక్కి తిరిగినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో మౌనం దాల్చారనే ఆరోపణలున్నాయి.

అనుమతి గోరంత.. దోపిడీ కొండంత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటవీ భూముల్లోని పలు రకాల జాతి కర్రలను యథేచ్ఛగా కొడుతున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని కొండంత దోపిడీకి పాల్పడుతూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ రెండు వారాల క్రితం సీఎస్‌పురం మండలంలోని అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న కొండ కర్ర లారీని అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక రకమైన కర్ర కొట్టేందుకు అనుమతి తీసుకుని మరో రకమైన జాతి కర్రను తరలిస్తుండగా ఫారెస్ట్‌ శాఖ ఉన్నతాధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన కర్రను, లారీని సీజ్‌ చేశారు. ఈ కేసులో ఒక ఎఫ్‌బీవో, సెక్షన్‌ అధికారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

కొట్టుకున్నోడికి కొట్టుకున్నంత..

పీసీపల్లి మండలంలో అధికార పార్టీ నేతల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ వైపు తెల్లరాయి.. మరో వైపు ఇసుక, ఇంకో వైపు మట్టి ఇలా అన్ని రకాల సహజ వనరులను దోచుకుంటున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌, భూముల్లో జోరుగా తెల్లరాయి అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. మైనింగ్‌ శాఖ అధికారులు నామ్‌కే వాస్తే దాడులు చేసి.. మమ అనిపిస్తున్నారు. ఇక చిల్లకర్ర, జామాయిల్‌ కర్రలను యథేచ్ఛగా కొడుతున్నారు. అన్నపరెడ్డిపల్లి, కోడూరివారిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని అటవీ భూముల్లో, చెరువు భూముల్లోని చిల్లకర్రను భారీగా కొట్టి తరలించుకుంటున్నా ఇరిగేషన్‌, ఫారెస్ట్‌, మైనింగ్‌ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు.

జోరుగా జామాయిల్‌ కర్ర కొట్టివేత

పీసీపల్లి, వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు మండలాల్లోని శివారు ప్రాంతాల్లోని అటవీ భూముల్లో జామాయిల్‌ కర్రను అధికార పార్టీ నేతలు అక్రమంగా కొట్టి తరలించుకుంటున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం అక్రమంగా కొట్టి తరలిస్తున్న జామాయిల్‌ కర్రలోడును వెలిగండ్ల పోలీసులు పట్టుకున్నారు. సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు మండలాల్లో జోరుగా జామాయిల్‌ కర్రను ప్రభుత్వ భూముల్లో కొడుతున్నారు.

కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి ఎక్కువ గిరాకీ ఉండటంతో అధికార పార్టీ నేతల అండతో నియోజకవర్గంలో జోరుగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. కొద్ది కాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల మండలాల శివారు ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షల విలువైన తెల్లరాయిని అధికారులు పట్టుకోగా.. పీసీపల్లి మండలంలోని మురుగమ్మిలో, గుంటుపల్లి ఏరియాల్లో మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు రెండు దఫాలు తెల్లరాయిని ఫారెస్ట్‌, రెవెన్యూ భూముల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. పీసీపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని రెవెన్యూ, అటవీ భూముల్లో గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు తదితర ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నాయకులతో ములాఖత్‌ అయి.. వారి వాటా వారికి చెల్లిస్తూ.. గప్‌ చుప్‌గా రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. వచ్చిపట్టుకునే పరిస్థితి లేదు. ఇటీవల జమ్మలమడక, నాగిరెడ్డిపల్లి కొండ వద్ద అటవీ భూముల్లో తవ్విన తెల్లరాయిని స్థానిక ఫారెస్ట్‌ అధికారులు పట్టుకోవడం తప్ప.. మిగిలిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూసింది లేదు. ఇక కనిగిరి, పామూరు, సీఎస్‌పురం మండలాల్లో కొందరు అర ఎకరా భూమిలో తెల్లరాయి తవ్వకానికి అనుమతి పొంది.. పది ఎకరాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ దోచుకుంటున్నారు.

అక్రమంగా తెల్లరాయిని తవ్వినా, కొండ కర్రను తరలించినా కఠిన చర్యలు

ఫారెస్ట్‌ భూముల్లో అక్రమంగా, అనుమతి లేకుండా తెల్లరాయిని తవ్వినా, కొండ భూముల్లో, అటవీ ప్రాంతాల్లో కర్రను, కలపను, చిల్ల కర్రను కొట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఇటీవల అనుమతి లేకుండా తరలిస్తున్న సుమారు రూ.1.40 లక్షల విలువైన కర్రను పట్టుకున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్‌పురం మండలంలోని ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశాం. పీసీపల్లి మండలం ఏరియాలో పొగాకు రైతులు ఎక్కువగా అనుమతి లేకుండా చిల్లకర్రను కొడుతున్నట్లు తెలిసింది. నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం. సీఎస్‌పురం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగల అక్రమ తరలింపు జరగడం లేదు. కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని పటిష్ట నిఘాకు అధికారులకు, సిబ్బందికి గట్టి ఆదేశాలిచ్చాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటాం.

– తుమ్మా ఉమామహేశ్వరరెడ్డి, కనిగిరి ఫారెస్ట్‌ రేంజర్‌

కూటమి దొంగలు1
1/1

కూటమి దొంగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement