
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ పీ రాజాబాబును ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్క అందజేశారు. అనంతరం ఇద్దరు జిల్లాలోని పరిస్థితుల గురించి కొంతసేపు చర్చించుకున్నారు.
● లేకుంటే రూ.3 వేల బోనస్ ఇవ్వాలి
● ఉప్పుగుండూరులో శనగ రైతుల సమావేశం
నాగులుప్పలపాడు: జిల్లాలో రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.10 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకుంటే రూ.3 వేల బోనస్ ఇవ్వాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జే జయంతిబాబు, కిసాన్ సంయుక్త మోర్చ నాయకుడు హనుమారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఉప్పుగుండూరు మార్కెట్ యార్డ్ లో కిసాన్ సంయుక్త మోర్చ ఆధ్వర్యంలో సోమవారం శనగ రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతిబాబు, హనుమారెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా శనగపంట సాగుచేశారని, గత రెండు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి పండించిన శనగ పంటను కోల్డ్ స్టోరేజ్ ల్లో నిల్వచేశారని చెప్పారు. విత్తనం వేసేటప్పుడు క్వింటా రూ.10 వేలు ఉన్న శనగ రేట్లు ఒక్కసారిగా రూ.5 వేలకు దిగజారడంతో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్నారన్నారు. ఒక పక్క తెగుళ్లు, మరోపక్క రేట్లు దిగజారడంతో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్ ల్లో నిల్వ ఉన్న శనగలను క్వింటా రూ.10 వేలకు కొనాలని, లేదా రూ.3 వేలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షుడు టీ శ్రీకాంత్, జీ బసవపున్నయ్య, చెరుకూరి వాసు, గాదె నాగేశ్వరరావు, వివిధ గ్రామాల శనగ రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ