
ప్రభుత్వ వైద్యశాల చైర్మన్‌ను పక్కన పెట్టి...
ఎటువంటి హోదా లేకున్నా కూటమి నాయకుడితో ప్రారంభోత్సవాలు
యర్రగొండపాలెం: ప్రభుత్వ వైద్యశాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను సిబ్బంది పక్కనపెట్టి ఎటువంటి హోదాలేని కూటమి నాయకుడితో ప్రారంభోత్సవం చేయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఆ నాయకుడు నిస్సిగ్గుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వైద్యశాలలో కంటి సేవా సెంటర్‌ను కూటమి నాయకుడు గూడూరి ఎరిక్షన్ బాబుతో ప్రారంభోత్సవం చేయించారు. ఆ వైద్యశాలకు ఎమ్మెల్యే చైర్మన్ అయినప్పటికీ కూటమి నాయకుడి సలహా మేరకు ఆయనకు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అధికారం ఉందని పచ్చనేతలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వైద్యశాల సిబ్బంది భయంతోనే టీడీపీ నాయకులను ఆహ్వానించాల్సి వచ్చిందని పలువురు తెలిపారు. ఇటువంటి పరిస్థితి అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు.