
లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం
టంగుటూరు: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పు నాయుడుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు... మండలంలోని ఆలకూరపాడు పంచాయతీ పరిధిలోని పుల్లారెడ్డిపాలెంకు చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు(51), టంగుటూరు పంచాయతీ పరిధిలోని వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చొప్పర శీను(43) ఇద్దరూ మోటార్ సైకిల్పై టంగుటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా తూర్పునాయుడుపాలెంలో ఫ్లైఓవర్ దిగే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్సులో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులిద్దరూ రైతులే. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులిద్దరూ రైతులే..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరూ రైతులే. బొడ్డు వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర్లుకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహం కాగా కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. చొప్పను శ్రీను ట్రాక్టర్ తోలుకుంటూ జీవనం సాగిస్తుండగా ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. రెండు కుటుంబాల్లో ఇంటి పెద్దలు మృతి చెందడంతో తీవ్ర శోకంలో మునిగిపోయాయి.

లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం

లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం