
పెండింగ్ కేసులపై దృష్టి
● ఎస్పీ హర్షవర్ధనరాజు
పామూరు: పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై చర్చించారు. రాత్రిళ్లు గస్తీ, ట్రాఫిక్, ఇతర కేసుల వివరాలపై ఎస్సైతో చర్చించారు. సమస్యలపై స్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను సత్వరం పరిశీలించి న్యాయంచేయాలని ఆదేశించారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరంచేయాలని, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్‌బీ సీఐ రాఘవేంద్ర, పామూరు ఎస్సై టి.కిషోర్‌బాబు ఉన్నారు.
పొన్నలూరు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల పారదర్శకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేసి పలు అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలపై, నేర నివారణ వ్యూహాలపై నిత్యం సమీక్ష చేసుకోవాలన్నారు. బెల్ట్ షాపులు, పేకాటపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నేర ప్రవర్తన కలిగిన వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఉంచి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
పీసీపల్లి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దొంగతనాలు నివారించేందుకు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రోన్ కెమెరాలతో కోడిపందేలు, పేకాటపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్సై కోటయ్య ఉన్నారు.