
జిల్లాను త్వరగా ఏర్పాటు చేయాలి
మార్కాపురం కేంద్రంగా త్వరగా జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలి. నాడు ప్రతిపక్ష నాయకులుగా ప్రస్తుత కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో మార్కాపురం వచ్చినప్పుడు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పారు. కార్యరూపం దాల్చి నిర్ణీత సమయాన్ని ప్రకటించి త్వరగా జిల్లా ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం పుల్లలచెరువు నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, గిద్దలూరు, అర్ధవీడు, దోర్నాల మండలాల ప్రజలు వివిధ పనుల కోసం ఒంగోలుకు వెళ్లాలంటే చాలా అవస్థలు పడుతున్నారు.
– డీ సోమయ్య, సీపీఎం జిల్లా నాయకులు