
●ఏడాదిలో ఏం చేశారు..
అధికారంలోకి వచ్చేందుకు కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. సంక్షేమ పథకాలు అందించకపోగా.. సంపద సృష్టి పేరిట ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూళ్లకు తెర తీశారు. రైతులను దగా చేశారు. వ్యవసాయ పెట్టుబడికి ఆర్థిక సాయం ఇప్పటికీ ఇవ్వలేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాల విషయంలో కాలయాపన సాగుతోంది. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఉన్న ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు. ఎన్నికల ముందు పాలకొండ వచ్చిన నేతలు.. అనేక హామీలిచ్చారు. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేకపోయారు.
– గవర ప్రవీణ్‌కుమార్, పాలకొండ మండలం