
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌లకు రేడియేషన్ థెరపీ, కిమో థెరపీ, ఆపరేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
–డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు