మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు

Oct 9 2025 3:11 AM | Updated on Oct 9 2025 3:11 AM

మైనార

మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు

మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు బార్‌ ఎదుట వ్యక్తి అనుమానాస్పద మృతి రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

లక్ష్మీపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్‌లోని దోహాలో హోమ్‌కేర్‌ నర్సు సేవల కింద ఉద్యోగం చేయాలనుకున్న అర్హులైన మైనారిటీ (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు సాబిరా బేగం బుధవారం తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉన్న యువకులు, అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. ప్రధానంగా అభ్యర్థులకు రెజిస్టర్‌ నర్స్‌ (హోమ్‌కేర్‌), బీఎస్సీ, జీఎన్‌ఎం నర్సింగ్‌, 21నుంచి 40 సంవత్సరాల వయస్సు, సీ్త్ర, పురుషులు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చని, కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. ఉత్సాహవంతులైన అభ్యర్ధులు ఈనెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సందిగా తెలియజేశారు. www. naipunyam. ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 13వ తేదీన ఓఎంసీఆర్‌ ఆఫీసు, గవర్నమెంట్‌ ఐటీఐ క్యాంపస్‌, రమేష్‌ ఆసుపత్రి రోడ్‌, విజయవాడలో ఇంటర్వ్యూ జరుగుతుందని పూర్తి వివరాల కోసం 9849901142, 9100955737 నంబర్లను సంప్రదించాల్సిందిగా తెలిపారు.

నరసరావుపేట టౌన్‌: బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన అంగలకుదురు చిన కోటేశ్వరరావు(50) చిత్రాలయ టాకీస్‌ సెంటర్‌ సమీపంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట మృతి చెంది పడి ఉన్నాడు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావించారు. సమాచారం అందుకున్న టూ టౌన్‌న్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో లభ్యమైన ప్రభుత్వ వైద్యశాల ఓపీ చీటీ ఆధారంగా చిన కోటేశ్వరరావుగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్‌న్‌ సీఐ హైమారావు తెలిపారు.

తెనాలిరూరల్‌: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పెదవడ్లపూడి స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని బుధవారం పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుని జేబులో ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తీసుకున్న ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌, కుడిచేతిపై వినోద్‌ అనే పచ్చబొట్టు రాసి ఉందని జీఆర్పీ ఎస్‌ఐ వెంకటాద్రిబాబు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని కోరారు.

మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు 1
1/1

మైనార్టీలకు ఖతార్‌లో ఉద్యోగ అవకాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement