
‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ
వర్గాలుగా విడిపోయిన తమ్ముళ్లు అక్రమాల కోసం ఎమ్మెల్యే ప్రోత్సాహం వేమూరులో పరస్పరం దాడులు పోలీసు సహా పలువురికి గాయాలు
అక్రమార్జనలో ఆరితేరిన తమ్ముళ్లు ఇప్పుడు కొట్లాటలకు సైతం వెనుకాడం లేదు. పదవుల నుంచి ఇసుక దందా, మట్టి తరలింపు, మద్యం మాఫియా, బియ్యం అక్రమరవాణా... ఇలా పలు అంశాల్లో తాము చెప్పినట్లే జరగాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మండల, గ్రామ స్థాయి పచ్చనేతల తీరు ఇలా ఉండటంతో వర్గ విభేదాలు పెరిగాయి. ఆధిపత్యం చాటేందుకు తన్నుకోవడానికై నా సై అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పచ్చపార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. శుక్రవారం కొల్లూరు మండల నేతలు డాక్టర్ కనగాల మధుసూదన్, మైనేని మురళి వర్గాలు రోడ్డున పడి తన్నుకున్నాయి. నక్కా సమక్షంలోనే డాక్టర్‌పై మురళి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ప్రతిగా డాక్టర్ వర్గీయులు వారిని కొట్టారు. ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలు కాగా, అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌కు సైతం గాయాలు తప్పలేదు. ఇంత జరిగినా కేసులు లేవు.
అంతటా అదే తంతు..
అక్రమాలకు వారే కీలకం
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రోత్సహిస్తున్న వర్గీయులకు పదవులు దక్కుతున్నాయి. దీంతోపాటు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, బియ్యం దందాను నడిపిస్తున్నారు. కొల్లూరులో ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్న మైనేని మురళి వర్గం ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్న వర్గాలు కూడా బియ్యం, లిక్కర్, బెల్టు షాపుల దందా చేస్తున్నాయి.