
కె. రాజుపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి అవార్డు
బల్లికురవ: జిల్లా స్థాయిలో స్వచ్ఛ అంగన్‌వాడీ కేంద్రంగా మండలంలోని కె. రాజుపాలెం గ్రామ కేంద్రాన్ని ఎంపిక చేసినట్లు ఐసీడీఎస్ సంతమాగులూరు సీడీపీఓ దీవి సుధ ఆదివారం తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం బాపట్లలో అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకురాలైన కార్యకర్త పి. నిర్మలాదేవి అవార్డు అందుకోనున్నట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిందని గుర్తుచేశారు. జిల్లాలోని 5 స్వచ్ఛ అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కె. రాజుపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త పి. నిర్మలాదేవి, సహాయకురాలు భాగ్యలక్ష్మి రెండున్నర దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు అవార్డుతో గుర్తింపు లభించినట్లు సీడీపీఓ వివరించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు బాపట్ల ఎంఆర్‌ఎఫ్ కల్యాణ మండపంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుందని చెప్పారు.
జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు
అందుకోనున్న కార్యకర్త

కె. రాజుపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి అవార్డు