
బగళాముఖి అమ్మవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలులో ప్రసిద్ధి గాంచిన బగళాముఖి అమ్మవారిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం న్యాయమూర్తికి వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో అమ్మవారి ఆలయ విశేషాలను న్యాయమూర్తికి తెలిపారు. న్యాయమూర్తి వెంట బాపట్ల రెండవ అడిషనల్ జడ్జి పి.రాజశేఖర్ పీవీపాలెం ఎంఆర్‌వో డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ. ఎంవీ శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
– జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: ఆటో డ్రైవర్లు కష్టజీవులని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శనివారం టౌన్ హాలులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 8,884 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున మొత్తం రూ.13.32 కోట్లు జమ చేశామన్నారు. డ్రైవర్లకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్టీవో సంజీవ్‌కుమార్, ఆర్డీవో కె.మధులత, ఎంవీఐ శివ నాగేశ్వరరావు, తహసీల్దార్ కె.వేణుగోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం వకాలత్ కార్యక్రమం నిర్వహించారు. బ్రాడీపేట నుంచి లాడ్జి సెంటర్ వరకు 200 మంది బ్యాంకు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ మన భాగస్వామ్య బాధ్యత అని నినాదాలు చేశారు. బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్‌కుమార్ రెడ్డి పాల్గొని విజిలెన్స్ అవగాహన వారంపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఏసీవీవో వివేక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రజలలో విజిలెన్స్‌పై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీజీఎం వికాస్ వినీత్, బ్యాంక్ విజిలెన్స్ ఇన్‌చార్జి ఆఫీసర్ హరీష్ బేతా, జనరల్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

బగళాముఖి అమ్మవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

బగళాముఖి అమ్మవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి