
కొద్ది నెలల క్రితం సుప్రీం కోర్టు విడుదల చేసిన వ్యక్తే మళ్లీ...
అతడు సాముహిక అత్యాచారం కేసుకి సంబంధించిన ముగ్గురు నిందితుల్లో ఒకడు. కానీ ఆ వ్యక్తిని ఇటీవలే సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితేలైన కొద్దిరోజుల్లోనే మళ్లీ ఓ హత్య కేసులో నిందితుడిగా పట్టుబడ్డాడు. ఈ అనుహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..2012లో ఒక యువతిపై సాముహిక అత్యాచారం చేసి, చంపిన కేసులో ముగ్గురు వ్యక్తులకు మరణశిక్ష పడింది. అందులో వినోద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఐతే అతను గతేడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ విఫలమైందని వారి ఈ దారుణానికి పాల్పడ లేదు అనేదానికి బలం చేకూర్చేలే ఉందంటూ వినోద్ అనే వ్యక్తిని విడుదల చేసింది ధర్మాసనం. ఐతే ఈ వినోద్ జనరి 26న ద్వారక సెక్టార్13లో చోరికి యత్నించిన ఒక ఆటో డ్రైవర్‌ని తన సహచరుడితో కలిసి హతమార్చాడు.
ఐతే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్‌లు పరిశీలించి.. వినోద్ సహచరడు పవన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు పవన్‌ని విచారించగా .. వినోద్ విషయం బయటపడింది. అంతేగాదు నిందితుడు ఆటోలో ముందుగానే మాటువేసి ఆటో డ్రైవర్‌ని హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐతే సాముహిక అత్యాచార కేసులో వినోద్ నిందితడన్న విషయం పవన్‌కు తెలియదని పోలీసుల చెబుతున్నారు.
ఈమేరకు పోలీసులు వినోద్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఫిబ్రవరి 2012లో 19 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారానికి సఒడిగట్టిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఐతే ట్రయల్ కోర్టు 2014 ఈ కేసును 'అరుదైన కేసుగా' పేర్కొంటూ.. సదరు నిందితులకి మరణశిక్ష విధించింది. ఈ ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు26, 2014న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఐతే సుప్రీం కోర్టు దీన్ని కూడా పక్కన పెట్టి ఆ ముగ్గురు వ్యక్తులను నిర్దోషులగా ప్రకటించడం గమనార్హం.
(చదవండి: రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు)