
ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి
నారాయణపేట: వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ అన్నారు. రామాయణం రచించిన వాల్మీ కి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రత్నాకరుడి నుంచి మహర్షి వా ల్మీకిగా ఆయన పరివర్తన, వ్యక్తిగతవృద్ధి, విముక్తిని సూచిస్తుందని, ఆయన రామాయణాన్ని సృష్టించిన గొప్ప రుషి అని కొనియాడారు. వాల్మీకి సంసృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అన్నారు. రామాయణాన్ని రాసిన ఆయనను సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్‌గంగ్వార్, శ్రీను, ఎస్‌డీ రాజేందర్‌గౌడ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖలీల్, డీపీఆర్‌ఓ రషీద్, సీపీఓ యోగానంద్, వసతి గృహా వార్డెన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.