
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పాసు పుస్తకాల కోసం తహసీల్దార్‌కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
● రుణాలు ఇవ్వని బ్యాంకర్లు
● ఇబ్బందులకు గురవుతున్న రైతులు
నారాయణపేట: జిల్లాలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం నివాసంలో ఆమె సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన సీఎం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి ఉన్నారు.
నాలుగు నెలలుగా ఎదురుచూపులు
కొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు మండలాల పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు, విరాసత్‌లు, భూ దానాలు తదితర విక్రయాలు జరిగినా జూన్ మాసం నుంచి ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు రైతులకు పాసు పుస్తకాలు అందించడంలో జాప్యం చేస్తున్నారు. కోస్గి మండలంలో 810, మద్దూరులో 704, కొత్తపల్లిలో 283, గుండుమాల్ మండలంలో 372మంది రైతులకు పాసుపుస్తకాలు రావాల్సి ఉంది.
భూమి హక్కులు ఉన్నా..
భూమిపై సంబంధిత రైతులకు హక్కులు ఉన్నా.. పాసుపుస్తకం లేని కారణంగా వారికి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. భూమి రిజిస్టేషన్ చేసుకున్న సమయంలోనే వాటికి సంబంధించిన ప్రొసీడింగ్, తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం ఇచ్చి పంపిస్తున్నారు. ఈ పత్రం తీసుకొని ఆయా బ్యాంకుల చుట్టు తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి