
అధికారులను అడిగినా..
నేను నాలుగు నెలల క్రితం ఎకరా భూమిని కొనుగోలు చేసి, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. కానీ ఇంత వరకు పాసుబుక్కు రాలేదు. ప్రతి రోజు పోస్టుమెన్‌ను అడిగి తెలుసుకుంటున్నాను. తహసీల్దార్‌ను అడిగినా సమాధానం రావడం లేదు. ప్రభుత్వ అధికారులు స్పందించి పాసు పుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – గౌస్, మద్దూరు
రైతు ఇంటికే వస్తుంది..
నాలుగు నెలల నుంచి భూమి రిజిస్ట్రేషన్, భూదానాలు, విరాసత్, భాగపరిష్కారాలు చేసుకున్న రైతులకు పాసుబుక్కులు రాకపోవడం నిజమే. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే పాసు పుస్తకానికి సంబంధించిన డబ్బులు ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారు. పాసుబుక్కు సైతం పట్టదారు నమోదు చేసుకున్న అడ్రస్‌కే పోస్టులో వస్తుంది. ఎక్కడ జాప్యం జరుగుతుందో ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతుల సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
– జయరాములు, తహసీల్దార్, కొత్తపల్లి
●

అధికారులను అడిగినా..