
సాగునీరు వృథా కాదు..
నీటి సంఘాలతోనే చెరువులు అభివృద్ధి చెందుతాయి. గతంలో నీటి సంఘాలు ఉండటం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వారి పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండేది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించినా అక్కడక్కడ పనులు నాణ్యతగా జరగలేదు. కాంట్రాక్టర్లపై నీటి సంఘాలు ఉంటే పనులు పూర్తిగా జరిగి ఉండేవి. ఇప్పటికై నా నీటి సంఘాలను ఎన్నుకొని చెరువులను అభివృద్ధిపర్చాలి.
– రఘు, రైతు, మరికల్
పర్యవేక్షణ పెరుగుతుంది..
చెరువుల పర్యవేక్షణ కోసం నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో చెరువుల అభివృద్ధి పనులు నీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు చూసుకునే వారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో ఆ బాధ్యతలు మేమే చూస్తున్నాం. ప్రభుత్వం నీటి సంఘాలను ఎన్నుకుంటే తమపై పనిభారం తగ్గుతుంది.
– కిరణ్‌కుమార్, డీఈఈ, ఇరిగేషన్‌శాఖ
●