
కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు
నారాయణపేట రూరల్: ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్‌ను పట్టిపీడిస్తున్న కులవివక్ష నిర్మూలనకు పోరాటమే సరైన మార్గమని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము అన్నారు. జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులవ్యవస్థ భారత దేశంలో ఉందని.. రాజకీయ ప్రజాస్వామ్య విలువలకు ఆటంకంగా మారిందన్నారు. కులవివక్ష నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ సభలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనుషులంతా సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలు, సమసమాజ నిర్మాణం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కాశీనాథ్, నర్సింహులు, జయ, ప్రశాంత్, శారద, సౌజన్య, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రాధిక, అనిత తదితరులు ఉన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి
నారాయణపేట రూరల్: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోశల్ వినోద్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతిరెడ్డి, లక్ష్మీగౌడ్, బలరాంరెడ్డితో పాటు జిల్లా మాజీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులును శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నాగురావు నామాజీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మదన్, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, ప్రభంజాన్, మొగులప్ప, కిరణ్, సూర్యకాంత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు