
బోనస్ రాలేదు..
యాసంగిలో 68 కింటాళ్ల సన్నరకం వరి ధాన్నాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు బోనస్ పడలేదు. వానాకాలం పంట కోతలు కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బోనస్ చెల్లించాలి.. లేని పక్షంలో నిరసన బాట పడతాం.
– మధుసూదన్‌రెడ్డి, రైతు, కొత్తపల్లి
ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది
యాసంగిలో వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేశాం. బోనస్ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే జమ చేస్తాం. వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి.
– సైదులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
●