
తెల్ల బంగారందిగుబడి పెరిగేనా
● జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో సాగు
● దిగుబడి అంచనా 20.14 లక్షల క్వింటాళ్లు
● సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
7 సీసీఐ కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉన్న 7 కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. కాగా అక్టోబర్ 1 వరకు నారాయణపేట, మక్తల్‌లో ఒక్కొక్క కేంద్రాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మద్దతు ధర రూ.8,110
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలుకు సంబంధించి నియమాలను కఠినతరం చేసింది. ఈ సారి పత్తిలో తేమ 12 కన్నా ఎక్కువ శాతం ఉంటే కొనుగోళ్లకు అనుమతించబోమని, తేమ శాతం 8 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని సీసీఐ చెప్పుకొచ్చింది. అలానే తేమ శాతం 8–12 మధ్య ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది. పొడవాటి దూదికి క్వింటాలుకు రూ.8,110, మధ్యస్థ దూదికి రూ.7,710 గా సీసీఐ మద్దతు ధర ప్రకటించింది.
నారాయణపేట: ఈ ఏడాది వానాకాలంలో సాగు చేసిన పత్తిపంట అధిక వర్షాలతో దెబ్బతినడంతో దిగుబడిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 20.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని పలు ప్రైవేట్ కాటన్‌మిల్లులో పత్తి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కాగా ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసేందుకు జిల్లా మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తుంది. మరో వైపు అధికార యంత్రాంగం కాటన్ దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేసేందుకు నేరుగా రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
వర్షాలతో దెబ్బతింటున్న పత్తి పంట.. ఆందోళనలో రైతులు

తెల్ల బంగారందిగుబడి పెరిగేనా