
వైఎస్సార్‌సీపీ టాక్స్–కర్నూలు యూట్యూబ్ చానల్ ప్రారంభ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ టాక్స్– కర్నూలు యూట్యూబ్ చానల్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.