
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్, సిద్దరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.
చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తాం
నంద్యాల: ప్రజలు ఇచ్చిన సమస్యలను చట్ట పరిధిలో విచారించి సత్వర న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదు లు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్నప్రసాద వితరణకు విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. సోమవారం గుంటూరుకు చెందిన దాత వీరశేఖరరావు రూ.1,00,116, కర్నూలుకు చెందిన దాత ఎల్.రమేష్‌బాబు రూ.1,01,101 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
నేడు కర్నూలుకు డీజీపీ
కర్నూలు: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు డీజీపీ కర్నూలుకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖకు సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం వీవీఐపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై డీజీపీ సమీక్షించనున్నారు.
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేసేందుకు జూలై 7న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏడు కేటగిరీల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌లను https:// kurnool.ap.gov.in, https://kurnool medical college.ac.in వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు కర్నూలు మెడికల్ కాలేజీలో సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పంపిన అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు.

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ