
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
● ఉనికి కోల్పోతామనే భయంతోనే
టీడీపీ నాయకుల దాడులు
● రౌడీషీటర్‌కు పోలీసుల అండదండలు!
● మాజీ ఎమ్మెల్యేకాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న కలుగొట్ల గ్రామంలో రాబోయే రోజుల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్దగుర్రప్ప, తలారి శ్రీనివాసులు, నడిపిగుర్రప్ప, చిన్నగుర్రప్ప, గడ్డం బ్రహ్మానందరెడ్డి, బూస సుధాకర్‌రెడ్డి, మగ్బుల్‌పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం నాగార్జునరెడ్డి తన అనుచరులతో కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాటసాని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న గ్రామంలో ఆధిపత్యం కోసం పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్న నాగార్జునరెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. రౌడీషీటర్‌గా ఉన్న టీడీపీ నాయకుడిని పోలీసులు గడిచిన 15 నెలల కాలంలో ఏ రోజు పోలీస్‌స్టేషన్‌కు పిలువలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని, తామేమి చేసినా అడిగేవారు ఉండరన్న అహంభావంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీషీటర్ అండతోనే గ్రామంలో బహిరంగంగా బెల్ట్‌షాపు ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. బస్టాండ్ ప్రాంతంలో తెల్లారకముందే మద్యం బాటిళ్లు అమ్ముతున్నా స్థానిక, ఎకై ్సజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూరగాయలు, పాలు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీని కలిసి వివరిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాచంరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, రాజారెడ్డి, పోతం రాంమోహన్‌రెడ్డి, ఉప్పరి సుబ్బరాయుడు, రాంభూపాల్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.