
వర్షంలో సచివాలయ ఉద్యోగుల నిరసన
బొమ్మలసత్రం: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ తీర్చాలంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయంలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నంద్యాల అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేల నుంచి తమకు విముక్తి చేయాలన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.