
కేఎంసీ మైక్రోబయాలజీకి ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి(కేఎంసీ)లోని మైక్రోబయాలజీ విభాగానికి ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించింది. ఈ మేరకు మైక్రోబయాలజీ విభాగం వైద్యులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్‌ఐవీ పరీక్షలకు ఎన్‌ఏబీఎల్ నూతన నిబంధనల ప్రకారం గుర్తింపు లభించిందన్నారు. అత్యంత కచ్చితత్వంతో పరీక్షలు నిర్వహించే వారికే ఈ గుర్తింపు లభిస్తుందన్నారు. మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుకాదేవి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సహకారంతో సూపర్‌స్పెషాలిటీ డీఎం వైరాలజి సీట్లకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.