సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ

Sep 26 2025 7:20 AM | Updated on Sep 26 2025 7:20 AM

సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ

సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ

డిగ్రీ పునఃమూల్యాంకనం ఫలితాలు విడుదల

కొత్తపల్లి: సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ సాధ్యమని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్‌, బాలరాజు, కృష్ణమూర్తి, రవిగౌడ్‌ అన్నారు. గురువారం వారు నందికుంట గ్రామ సమీపంలోని వరిపొలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాతావరణం చల్లగా ఉండడంతో తెగుళ్లు సోకే అకాశం ఎక్కువగా ఉందన్నారు. రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టి సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమీరున్నీసా బేగం, ఏపీఎమ్‌ పుల్లయ్య, వెలుగు సీసీలు నరసింహులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్‌ నెలల్లో జరిగిన డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షల పునఃమూల్యాంకనం ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు. రెండో సెమిస్టర్‌కు సంబంధించి 541 మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 151 మంది, నాల్గవ సెమిస్టర్‌కు 781 మందికి 196 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.

బాషా, రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయండి

కర్నూలు (సెంట్రల్‌): లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కోడుమూరు బాషా, కర్నూలు రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ కమిటీ (పీసీ, పీఎన్‌డీటీ యాక్ట్‌) సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి 6వ అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శాంతికళ, సీఐ తబ్రేజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి మరణానికి కారణమైన రక్ష ఆసుపత్రిపై కేసు నమోదు చేసి సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ ప్రతినిధులు డాక్టర్‌ బాలమద్దయ్య, నోడల్‌ ఆఫీసర్‌ నాగప్రసాద్‌ బాబు, ప్రోగ్రాం కన్సల్టెంట్‌ సుమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement