
కానరావా.. దయ చూపలేవా!
శ్రీశైలానికి వెళ్లే
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న
ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండు
ఆత్మకూరు: మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఉచిత బస్సులను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటుడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వెళ్లడానికి వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరుకు వచ్చిన వారికి బుధవారం కష్టాలు ఎదురయ్యాయి. ‘శివశివా.. ఏమిటీ ప్రయాణ కష్టాలు’ అనుకుంటూ మల్లన్న స్వామిని చూడకుండానే చాలా మంది తిరిగి వెళ్లారు.
బస్సులు లేక..
కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ నుంచి మహిళలు గతంలో ఉచిత ప్రయాణం పేరుతో శ్రీశైలం వెళ్లేవారు. అయితే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు 123 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో శ్రీశైలానికి వెళ్లేందుకు ఉచిత బస్సులు లేవని కర్నూలు, నంద్యాల, ఇతర డిపోల్లో బుధవారం ప్రకటించారు. ఫలితంగా వివిధ మార్గాల్లో 500 మందికి పైగా ప్రయాణికులు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కొందరు పిల్లాపాపలతో ఆత్మకూరు బస్టాండులోనే భోజనాలు చేస్తూ కనిపించారు. ‘శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని చూసేందుకు వచ్చాం. స్వామిని చూడకుండానే వెనక్కి వెళ్తున్నాం. ఇదేం ప్రభుత్వం’ అనుకుంటూ చాలా మంది పెదవి విరిచారు.
ఇవీ కష్టాలు..
● అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం చంద్రబాబు నిర్వహించిన సీ్త్ర శక్తి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి డిపో నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
● పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా.. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులను సీఎం సభకు తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
మల్లన్న దర్శనం కోసం రాత్రి పత్తికొండ నుంచి కర్నూలుకు వచ్చాం. శ్రీశైలానికి బస్సులు లేవు, ఆత్మకూరుకు వెళ్లాలని చెప్పారు. ఇక్కడికి వస్తే బస్సులు లేవని చెబుతున్నారు. ఇబ్బందులు పడతామని వెనక్కి వెళ్తున్నాం. శ్రీశైలానికి బస్సు సర్వీసులు లేవని రెండు రోజుల ముందే ప్రకటన ఇచ్చి ఉండొచ్చు కదా?
– చిన్నమ్మ, పత్తికొండ గ్రామం, కర్నూలు జిల్లా
మేం ముఫ్పై మందిమి ఉన్నాం. శ్రీశైలానికి వెళ్లాలని బనగానపల్లె నుంచి నంద్యాలకు, అక్కడి నుంచి ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడ శ్రీశైలానికి బస్సులు లేవని చెబుతున్నారు. శనివారం వరకు ఆగాల్సిందే అంటున్నారు. శ్రీశైలానికి, ఇతర పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడం అన్యాయం.
– శివమ్మ, బనగాపల్లె గ్రామం, నంద్యాల జిల్లా
మా ఊరి నుంచి శ్రీశైలానికి బస్సులు లేవు. ఆళ్లగడ్డలో ఉన్న బస్సుల్లో ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడి నుంచి బోలెడు బస్సులు ఉంటాయని చెప్పారు. బస్సులు లేకపోవడంతో ఉన్న సద్దితో ఆత్మకూరు బస్టాండులో భోజనం చేశాం. మరలా వెనక్కి వెళ్తున్నాం. ఈ బస్సులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియడం లేదు.
– మల్లీశ్వరి, ఆళ్లగడ్డ గ్రామం, నంద్యాల జిల్లా
ఆత్మకూరు డిపో నుంచి ఫిట్‌నెస్ ఉన్న అన్ని బస్సులను ఉదయం 6 గంటల నుంచి పంపిస్తున్నాం. పెద్దసంఖ్యలో ప్రజలు ఆత్మకూరుకు తరలివచ్చారు. ఉన్న బస్సులన్నీ శ్రీశైలానికి పంపాం. ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన బస్సులు లేవు. నంద్యాల, కర్నూలుకు వెళ్లిన బస్సులు ఆత్మకూరుకు వచ్చిన వెంటనే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాం.
– వినయ్‌కుమార్,
ఆర్టీసీ డీఎం, ఆత్మకూరు
శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కరువు
ఆత్మకూరు బస్టాండులో
ప్రజల ఎదురు చూపులు
చిన్న పిల్లలతో మహిళల ఇబ్బందులు
మల్లన్న స్వామిని చూడకుండానే
తిరిగి వెళ్లిన వైనం

కానరావా.. దయ చూపలేవా!

కానరావా.. దయ చూపలేవా!

కానరావా.. దయ చూపలేవా!