వైద్యుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

వైద్యుల పోరుబాట

Sep 25 2025 7:03 AM | Updated on Sep 25 2025 7:03 AM

వైద్య

వైద్యుల పోరుబాట

విపత్కర పరిస్థితుల్లోనూ సేవలు

విజయావకాశాలు తగ్గించడం అన్యాయం

గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) పనిచేసే వైద్యులు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ మూడు రోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్ల అసోసియేషన్‌ పిలుపు మేరకు వైద్యులు ప్రస్తుతం నిరసన తెలుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర అసోసియేషన్‌ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు ఇచ్చే ఇన్‌ సర్వీస్‌ కోటాను ప్రభుత్వం తగ్గించడంతో వారంతా నిరసనబాట పట్టారు. తమ డిమాండ్‌ నేరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉన్న ఇన్‌ సర్వీస్‌ కోటాను తగ్గించడంపై మండిపడుతున్నారు.

ఇన్‌సర్వీస్‌ కోటా తగ్గింపుతో ఇబ్బందులు

పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్‌ కోట కుదిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్‌ 85కు బదులు తెచ్చిన జీఓ 99ని పీహెచ్‌సీ వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇది అమలు చేయడంతో తమ సర్వీస్‌కు అర్థం లేకుండా పోతుందని, అకస్మాత్తుగా జీఓను మార్చడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇన్‌సర్వీస్‌ కోటా క్లినికల్‌ 20శాతం ఉంటే 15శాతానికి తగ్గించారు. గతంలో మాదిరి క్లినికల్‌ కోటాను 20 శాతానికి పెంచాలని వైద్యులు కోరుతున్నారు. ఇన్‌సర్వీస్‌ కోటా తగ్గిస్తూ ఇచ్చిన జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జీఓతో తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితులిలా..

వైద్యులు చాలామంది కోవిడ్‌–19 వంటి విపత్కర పరిస్థితిలోనూ జీవితాలను ప్రమాదంలో పెట్టి వైద్యసేవలు అందించారు. ఇప్పుడు ఉన్న జీఓ85ను జీఓ 99గా మార్చి దాని ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయం. జీవో రద్దు చేయాలని కోరుతున్నాం.

– హుసేన్‌, డబ్ల్యూ.కొత్తపల్లి పీహెచ్‌సీ వైద్యుడు

జీఓ 99 అమలు కారణంగా సర్వీస్‌ కోల్పోవడంతో పాటు పీజీలో చేరే స్థానాల సంఖ్య తగ్గిపోతుంది. సరికొత్త జీఓతో వైద్యులకు భవిష్యత్తు లేకుండా చేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వం వెంటనే జీఓ 99ను రద్దు చేయాలి.

–డాక్టర్‌ ప్రణీత్‌ , జిల్లా జాయింట్‌ సెక్రటరీ, నంద్యాల

మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో

విధుల నిర్వహణ

సమస్యల పరిష్కారంపై స్పందించని

కూటమి ప్రభుత్వం

నంద్యాల జిల్లా పరిధిలో 59 పీహెచ్‌సీలు, 16 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 11 సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. వీటిల్లో 146 మంది వైద్యులు పనిచేస్తున్నారు. వైద్యులుగా విధుల్లో చేరాక ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వైద్యులకు సర్వీస్‌ కోట కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు జీఓ 85 ఉపయోగపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం గత ఆగస్టులో ఈ జీఓను 99గా మార్పుచేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

వైద్యుల పోరుబాట1
1/2

వైద్యుల పోరుబాట

వైద్యుల పోరుబాట2
2/2

వైద్యుల పోరుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement