
ఆత్మకూరు అటవీ డివిజన్ డీడీగా విఘ్నేష్ అపావ్
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌కు నూతన డిప్యూటీ డైరెక్టర్ (ప్రాజెక్ట్ టైగర్)గా ఐఎఫ్‌ఎస్ అధికారి విఘ్నేష్ అపావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులోని కోయంబత్తూరు వాసి అయిన ఈయన అనంతపురం జిల్లా ముఖ్య అటవీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డీడీగా పని చేసిన సాయిబాబా తిరుపతి డీఎఫ్‌ఓగా బదిలీ అయ్యారు.
గోసంరక్షణ నిధికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణనిధి పథకానికి బుధవారం హైదరాబాద్‌కు చెందిన చెన్నుదుర్గ సత్యనారాయణ రూ.1,00,116విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
ఆళ్లగడ్డలో 30.6 మి.మీ వర్షం
నంద్యాల (అర్బన్): ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 30.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే బండిఆత్మకూరు 24.6, రుద్రవరం 20.8, మిడుతూరు 19.2, గడివేముల 17.2, నంద్యాల అర్బన్ 165.4, బేతంచెర్ల 15.4, గోస్పాడు 13.8, సంజామల 13.2, కోవెలకుంట్ల 12.8, ప్యాపిలి 12.2, దోర్నిపాడులో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
నంద్యాల(న్యూటౌన్): పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి ఐబీపీఎస్ (క్లర్క్ ప్రొబిషనరీ ఆఫీసర్), ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కిల్, ఆఫీస్ అసిస్టెంట్, ఎస్‌ఎస్‌సీ (సీజీఎల్) టీఎర్ వంటి పరీక్షలు రాసే వారు అర్హులని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6లక్షలలోపు ఉండాలని తెలిపారు. ఈ నెల 24న ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయని, వచ్చేనెల 6న చివరితేదీ అని పేర్కొన్నారు.
ప్రత్యేక పరికరాలతో
వన్యప్రాణుల సంరక్షణ
మహానంది: గుంటూరు డివిజన్‌లోని నంద్యాల–గుంటూరు రైల్వే మార్గంలో భద్రతా చర్యలు పటిష్టం చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. చలమ–దిగువమెట్ట రైల్వే సెక్షన్ వెంట సిబ్బంది, ప్రయాణీకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రతి రోజూ ట్రాక్‌ను తనిఖీ చేసేందుకు డేపెట్రోలింగ్‌లో ఇద్దరు ఉంటారన్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ముగ్గురు వర్షాకాలంలో విధుల్లో ఉంటారని చెప్పారు. దిగువమెట్ట నుంచి చలమ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేరకు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు తదితర వన్యప్రాణుల సంరక్షణ కోసం పగలు, రాత్రి గస్తీ సిబ్బంది టాంబురైన్ లాంటి డ్రమ్స్, పటాకులు, ఫ్లాంబీలు, భద్రతా పరికరాలు వాడతారన్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టుకు అర్హులైన న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వారై కనీసం పదేళ్లపాటు న్యాయవాద వృత్తిలో అనుభవం కలిగి ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తును జిల్లా కోర్టు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చసుకొని ఈనెల 26వతేదీలోపు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

ఆత్మకూరు అటవీ డివిజన్ డీడీగా విఘ్నేష్ అపావ్

ఆత్మకూరు అటవీ డివిజన్ డీడీగా విఘ్నేష్ అపావ్