
నల్లమలలో ట్రాఫిక్ జామ్
మహానంది: నల్లమల ఘాట్‌రోడ్డులో బుధవారం దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు అవస్థలు పడ్డారు. మహారాష్టకు చెందిన సంఘ్వి మూవర్స్‌కు చెందిన భారీ వాహనం గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు వస్తుండగా చింతమాను టర్నింగ్ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం వాహనదారుల సహాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న భారీ వాహనాన్ని పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.