
అటు వైపు ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రతిపాదనలు..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ అడవుల్లో శ్రీశైలం రహదారిని ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించేందుకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పట్టణాలలో నిర్మించే ఫ్లైఓవర్‌లా అడవుల్లో కూడా పిల్లర్లపై అడవిపై రహదారిని నిర్మించడమే ఎలివేటెడ్ కారిడార్ అంటారు. అడవుల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇదే అత్యుత్తమ పరిష్కారంగా కనిపిస్తోంది. నిజానికి ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇందు కు ప్రతిపాదించడం చూస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం కానున్న జాతీయ రహదారులకు ఆర్థికంగా పెద్ద సమస్య కాబోదని తెలుస్తోంది. నల్లకాల్వ – వెలుగోడు మధ్య కేవలం ఏడు కి.మీ దూరం మాత్రమే ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే కర్నూలు – గుంటూరు మార్గంలో ఎస్‌ఎన్ తండా నుంచి ప్రకాశం జిల్లాలోని కొర్రప్రోలు వరకు సుమారు 30 కి.మీ ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించాలి. అప్పుడు అటు అటవీ రక్షణకు, వన్యప్రాణి సంరక్షణకు సమస్యలు తలెత్తవు. ప్రయాణికులకు వేగంగా గమ్యం చేరుకునే వీలు కలుగుతుంది. అందుకే నోడల్ సంస్థ అయిన ఎన్‌హెచ్‌ఏ ఈ ప్రణాళిక ను కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డు ముందు పెట్టాల్సి ఉంది.