అవును.. నిధులివ్వలేదు! | - | Sakshi
Sakshi News home page

అవును.. నిధులివ్వలేదు!

Sep 24 2025 7:37 AM | Updated on Sep 24 2025 7:37 AM

అవును.. నిధులివ్వలేదు!

అవును.. నిధులివ్వలేదు!

మైనార్టీ సంక్షేమం గాలికి..

గత వైఎస్సార్‌సీపీ

ప్రభుత్వంలో ఇలా..

మైనారిటీల సంక్షేమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 21,365.13 కోట్లు కేటాయించింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 51,04,409 మంది మైనారిటీలకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా నిధులు మంజూరు చేసింది. మౌజాన్‌ల గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు, ఇమామ్‌లకు రూ. 5 వేల నుంచి రూ.10 వేల కు పెంచి వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించడం విశేషం.

బొమ్మలసత్రం: శాసనమండలిలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మంగళవారం అడిగిన ప్రశ్నల కు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్‌ ఇచ్చిన సమాధానం చూస్తే కూ టమి ప్రభుత్వం తమను మోసం చేసిందన్న విషయం మైనారిటీలకు ఇట్టే అర్థమైంది.

శాసన మండలిలలో

ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలు

● 2025–26బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ.5,434కోట్లు, 2024–25 బడ్జెట్‌లో రూ.4,376 కోట్లు, సబ్‌ప్లాన్‌ కింద రూ.2,512 కోట్లు కేటాయించామని కూట మి ప్రభుత్వం చెబుతోంది.

● 50 ఏళ్లు నిండిన మైనారిటీలకు

పింఛన్‌ అందిస్తామన్నారు.

● ఇద్గాల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు.

● హజ్‌హౌస్‌ నిర్మాణానికి, నూర్‌బాషా కార్పొరేషన్‌కు నిధులు.

● రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు.

● ఇమామ్‌, మౌజాన్‌లకు ప్రతినెలా రూ.5 వేల గౌరవ వేతనం.

● దుల్హన్‌ పథకం ద్వారా రూ.లక్ష.

● మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా మైనారిటీ యువతి, యువకులకు ఆర్థిక తోడ్పాటు. రూ.2 లక్షలు, రూ.5 లక్షల స్కీమ్‌ కింద 50 శాతం సబ్సిడీ.

● ఈ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్‌ ఈ ఏడాదే అమలు చేస్తారా.. లేదా వచ్చే ఏడాది అమలు చేస్తారా?

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇచ్చిన సమాధానం

2024–25 బడ్జెట్‌లో రూ.173.5 కోట్లు కేటాయించాం. కానీ అప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిధులు విడుదల చేయలేకపోయాం.

● 2025–26 బడ్జెట్‌లో రూ.173.5 కోట్లు కేటాయించాం. అయితే ఫైనాన్స్‌ విభాగంలో ఉంది.

● నిధులు విడుదల కాగానే దాదాపు 19,779 మంది మైనార్టీ యువతకు ప్రయోజనం కలుగుతుంది.

వీటికి సమాధానం కరువు

● మౌజాన్‌, ఇమామ్‌ల గౌరవవేతనం, 50 ఏళ్లు పైబడిన వారికి పింఛన్‌, ఈద్గాలకు స్థలాల కేటాయింపు, హజ్‌హౌస్‌ నిర్మాణానికి నిధులు, నూర్‌బాషాల సంక్షేమానికి నిధులు, దుల్హన్‌ పథకం తదితర ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేయడం గమనార్హం.

కూటమి ప్రభుత్వాన్ని

ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా

హామీల వారీగా ప్రశ్నల వర్షం

ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదన్న మంత్రి ఫరూక్‌

ఈ విడత ఆదుకుంటామని

వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement