
ఓపెన్ స్కూల్ ప్రవేశానికి గడువు పెంపు
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీటం (ఏపీఓఎస్‌ఎస్) 2025–26 విద్యాసంవత్సరానికి పదవ తరగతి, ఇంటర్మీడియెట్ తరగతుల్లో ప్రవేశానికి రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన వారు పదవ తరగతిలో, 15 సంవత్సరాలు నిండిన వారు పది పాస్ అయి ఇంటర్మీడియెట్‌లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. మరింత సమాచారం కోసం www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా సమీపంలో ఉన్న ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో, డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యమొద్దు
ఉయ్యాలవాడ: పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఉయ్యాలవాడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అర్జీ అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంట్ క్లియర్‌గా ఇవ్వాలన్నారు. ఉయ్యాలవాడ మండలంలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని తహసీల్దార్ ప్రసాద్‌బాబు, ఆర్‌ఐ అంకన్న, మండల సర్వేయర్ విజయలక్ష్మి, సూచించారు.
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి గడుపు తేదీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న నిర్వహిస్తామన్నారు. సందేహాలుంటే 08512–294545 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎస్సీ యువతకు ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ద్వారా ఎంపికై న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీలో ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. మంగళవా రం స్థానిక కార్యాలయంలో ఈఓ విజయలక్ష్మితో కలిసి ఆమె ఎంపికై న అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసీదేవి మాట్లాడుతూ శిక్షణ కోసం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. కర్నూలు జిల్లాలో 10 మందిని, నంద్యాల జిల్లాలో 10 మందిని ఎంపిక చేశామన్నారు. శిక్షణనిచ్చే అంశాన్ని రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతామన్నారు. అనుమతి రాగానే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలల్లో శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.