శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

Sep 23 2025 11:43 AM | Updated on Sep 23 2025 11:43 AM

శాస్త

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమయ్వాయి. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాదవరద స్వామిని దేవాలయం ఎదురుగా ఉన్న యాగశాలలో కొలువుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నవకళస్తాపన గావించి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీ అమృతవల్లీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక నవరాత్రి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోనే నియామక పత్రాలు ఇవ్వాలి

ఆత్మకూరు: డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో నియామక పత్రాలు అందజేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికై న నూతన ఉపాధ్యాయులను ఏపీటీఎఫ్‌ కర్నూలు, నంద్యాల జిల్లాల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఏపీటీఎఫ్‌ ముందుంటుందన్నారు. నూతన ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపు మ్యానువల్‌గా అందజేయాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాల పీఆర్‌సీ, డీఏలను, బకాయిల సరెండర్‌ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్నారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో ఎంపికై న 136 మందిని సన్మానించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇస్మాయి ల్‌, మరియానందం, శ్రీనివాసులు, ఆత్మకూరు ఎంఈఓ అయూబ్‌అహ్మద్‌, శ్రీశైలం ఎంఈఓ కలి ముల్లా, ఉమ్మడి జిల్లా నాయకులు ఉమ్మర్‌, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, స్వామినాదం, వెంకటరాముడు, శ్రీరాములు, గోపాలరావు, అజయ్‌కుమార్‌, రవిప్రసాద్‌, రవికుమార్‌, రామ్మూర్తి, అంబయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తనిఖీలతో హడలెత్తించిన ఎస్పీ

నంద్యాల: ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. పట్టణంలోని ఎస్‌డీఓపీ కార్యాలయం, తాలూకా, సెంట్రల్‌ క్రైం, వన్‌టౌన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌, పోలీస్‌ క్వార్టర్స్‌ పరిసర ప్రాంతాలను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తాలూకా పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుంటూ పోలీసుల పని తీరు గురించి ఆరా తీశారు. అనంతరం స్టేషన్‌ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్‌ క్వార్టర్స్‌లోని పోలీస్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడ ఉన్న మందుల వివరాలు, డాక్టర్ల పనితీరు తదితర వాటిపై ఆరా తీశారు. నంద్యాల ఎస్‌డీఓపీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్‌, సైబర్‌ క్రైం, మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలోని సెంట్రల్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి సిబ్బంది వివరాల తెలుసుకున్నారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్పీ వెంట సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్‌, ట్రైనింగ్‌ డీఎస్పీ రాజాసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం 1
1/2

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం 2
2/2

శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement