
అయ్యో పాపం
● పాముకాటుతో తల్లి మృతి
● రెండేళ్ల క్రితం గుండెపోటుతో
తండ్రి మృత్యువాత
● అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు
బనగానపల్లె: విధిరాతకు ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. రెండేళ్లలోనే తల్లిదండ్రుల ను కోల్పోయి బంధువుల చెంతన చేరా రు. బనగానపల్లెకు చెందిన శేఖర్ గౌడ్, రమాదేవి దంపతులది పేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. కష్టపడి కుమారులను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. శేఖర్‌గౌడ్ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా రమాదేవి పిల్లలతో పుట్టినిల్లు యనకండ్లకు చేరుకుంది. రోజు కూలీకెళ్తూ పిల్లలను పోషించేది. ఈ క్రమంలో విధి ఆ తల్లిని పిల్లలకు దూరం చేసింది. రమాదేవి (35) సోమవారం కై ప గ్రామానికి కూలీ పనికి వెళ్లగా పొలంలో మధ్యాహ్నం ఆమెను పాముకాటు వేసింది. వెంటనే బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గంట వ్యవధిలోనే మృతి చెందింది. ఎనిమిదేళ్లలోపు ఇద్దరూ కుమారులు అనాథలుగా మారారు. పెద్ద కుమారుడు మాణిష్‌గౌడ్ 3వ తరగతి, చిన్న కుమారుడు హేమనాథ్ గౌడ్ యూకేజీ చదువుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నా రు. మృతరాలి సోదరుడు ఈడిగ హరిష్‌గౌడ్ ఫిర్యా దు మేరకు నందివర్గం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో పాపం