ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

Sep 21 2025 1:37 AM | Updated on Sep 21 2025 1:37 AM

ప్రతిభా విద్యార్థులకు  కలెక్టర్‌ అభినందన

ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

నంద్యాల(న్యూటౌన్‌): ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదివి నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు కలెక్టర్‌ రాజకుమారి అభినందించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో వారిని అభినందిస్తూ ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆత్మకూరు మండలం నందికుంట గ్రామా నికి చెందిన ప్రణయ్‌బాబు, గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన నితీస్‌ నాయక్‌ చిన్నటేకూరులోని ఏపీఆర్జేసీ స్కూల్‌లో 10వ తరగతి వరకు, అనంతరం డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ ఐఐటీ మెడికల్‌ అకాడమీలో ఇంటర్‌ చదివారన్నారు. అక్కడే నీట్‌ కోచింగ్‌ తీసుకుని మెడికల్‌ సీట్లు సాధించారన్నారు. ప్రణయ్‌ బాబుకు తిరుపతి మెడికల్‌ కళాశాలలో, నితీష్‌ నాయక్‌కు అనంతపూర్‌ మెడికల్‌ కళాశాలలో సీట్లు పొందారన్నారు. ఈనెల 22 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని, శ్రద్ధగా చదివి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో డీఆర్‌ఓ రామునాయక్‌, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ శ్రీదేవి, ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఫిజిక్స్‌ లెక్చరర్‌ ఉమామహేశ్వరప్ప విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రేపటి నుంచి దసరా సెలవులు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిందని డీఈఓ జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా దసరా సెలవులు ఈనెల 24వ తేదీ నుంచి ప్రకటించిందని, మార్పు చేస్తూ ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజులు సెలవులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. వచ్చే నెల 3న యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని తెలిపారు.

దేవరగట్టులో 2న బన్ని ఉత్సవం

హొళగుంద: దేవరగట్టులో దసరా బన్ని ఉత్సవం వచ్చే నెల 2న నిర్వహించనున్నారని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్య భరధ్వాజ్‌ ఆదేశించారు. దేవరగట్టులో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దలతో శనివారం ఆయన మాట్లాడారు. తేరు బజారు, డొళ్లిన బండెను పరిశీలించారు.

ముగ్గురు ఎంపీడీఓలకు పోస్టింగ్స్‌

కర్నూలు(అర్బన్‌): ఇటీవల ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఆరుగురిలో ముగ్గురికి పోస్టింగ్స్‌ ఇచ్చినట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ డ్వామాలో ఏఓగా విధులు నిర్వహిస్తు న్న టీ క్రిష్ణమోహన్‌ శర్మను గూడురు, పాములపాడు ఏఓ గాయత్రీని బండి ఆత్మకూరు ఎంపీడీఓగా, మహానంది డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న పీ నాగేంద్రుడును ఆత్మకూరుకు పోస్టింగ్‌ ఇచ్చామన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ దస్తగిరిబాబు, ఎస్‌ నాగరాజు, రామక్రిష్ణవేణికి ఇంకా పోస్టింగ్స్‌ ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో కోసిగి, ఓర్వకల్లు, నంద్యాల జిల్లాలో అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లెలో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, పోస్టింగ్స్‌ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని కూడా పీఆర్‌ కమిషనరేట్‌ నంద్యాల జిల్లాకే కేటాయించింది.

రెండో రోజూ స్తంభించిన రిజిస్ట్రేషన్‌ సేవలు

కర్నూలు(సెంట్రల్‌): దస్తావేజు రైటర్ల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్‌ సేవలు రెండో రోజూ స్తంభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విక్రయదారులు లేక కళ తప్పి కనిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రోజుకు దాదాపు 500 రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.30 లక్షల నుంచి 40 లక్షల ఆదాయం వస్తుంది. అయితే దస్తా వేజు లేఖరుల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపో యాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్క రించే వరకు పోరాటం చేస్తామని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట శనివారం దస్తావేజు లేఖరు లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూ నియన్‌ నాయకులు ఎస్‌ఏ రహమాన్‌, మహ్మద్‌ రఫీక్‌, చంద్రశేఖర్‌, రామకృష్ణ, నాగరాజు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీడీఈ విధానంలో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. నాయకులురాజా, మహేష్‌, గోపాల్‌, జగదీష్‌, భాస్కర్‌ గౌడ్‌, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement