
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గోస్పాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లెల్లలో ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతరావునాయక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు శక్తి వంతంగా ఉంటాయన్నా రు. గర్భిణులు, కౌమార బాలికలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.