
మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
మహానంది: గోపవరం సమీపంలోని సెయింట్ ఆన్స్ దివ్యాంగ వయోజన వసతి గృహ ంలో ఉంటున్న 36 ఏళ్ల షేక్ ముబీనా శుక్ర వారం నుంచి కనిపించడం లేదని ఎస్‌ఐ రా మ్మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని మ హబూబ్ బాషా కుమార్తె అయిన షేక్ ముబీనాకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇక్కడ వసతి పొందుతోందన్నారు. ముబీనా వెళ్లే సమయంలో ఆకుపచ్చ, తెల్లటి రంగు కలిగిన చుడీదార్, గులాబీ రంగు చున్నీ ధరించిందన్నారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 9121101093కు సమాచారం అందించాలని సూచించారు.
గోనెగండ్ల: జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు బైకుల దొంగతనలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ విజయ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెంది ఉప్పరి వీరేష్ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తర్వాత మద్యం, పేకాట, జూదం తదితర చెడు వ్యాసనాలకు బానిసయ్యాడు. కూలీ పనుల నుంచి వచ్చే ఆదాయం జల్సాలకు, ఖర్చులకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు బైక్‌ల చోరీని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇళ్ల ముందు, దేవాలయలు, బస్టాండ్ల దగ్గర పార్కు చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లి వాటిని ఇతరులకు విక్రయించేవాడు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన గొల్ల మధుశేఖర్, బొడ్డువాని పల్లెకు చెందిన చంద్రశేఖర్లు తమ బైక్‌లను గోనెగండ్లలోని శ్రీ చింతలాముని, నల్లారెడ్డి స్వామి దేవాలయం దగ్గర ఉంచగా చోరీ గురయ్యాయని గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పోలకల్ గ్రామానికి చెందిన ఉప్పరి వీరేష్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో శనివారం పథకం ప్రకారం మాటు వేసి గాజులదిన్నె ప్రాజెక్టు క్రాస్ రోడ్డు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. రూ.5లక్షలు విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. బైకుల దొంగను పట్టుకున్నందుకు సీఐ విజయభాస్కర్, పోలీసులు దేవరాజు, ఎన్‌టీ కుమార్, కార్తీక్, మద్దిలేటి, కృష్ణనాయక్, మహేంద్రలను డీఎస్పీ భార్గవి అభినందించారు.

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం