నర్సాపురంలో డెంగీ కేసు | - | Sakshi
Sakshi News home page

నర్సాపురంలో డెంగీ కేసు

Sep 20 2025 6:34 AM | Updated on Sep 20 2025 6:34 AM

నర్సా

నర్సాపురంలో డెంగీ కేసు

రుద్రవరం: నర్సాపురం ఎస్సీ కాలనీకి చెందిన కొండమ్మ అనే మహిళ డెంగీ జ్వరం బారిన పడింది. నర్సాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి బాబు శుక్రవారం సిబ్బందితో కలిసి ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులు గా కొండమ్మకు జ్వరం తగ్గకపోవడంతో వైద్యు లు నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్‌ చేయగా అక్కడ పరీక్షలు నిర్వహించగా డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అక్కడే ఆమెకు వైద్యం అందించడంతో కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడంతో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గ్రీన్‌ అంబాసిడర్లతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

బండి ఆత్మకూరు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌ రెడ్డి సందర్శించి బోధన, సౌకర్యాలు, విద్యార్థుల హాజరు, ఇటీవల పాఠశాల ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి, పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ఎండీ ప్రసన్నకుమార్‌, జిల్లా ప్రణాళిక, సహిత విద్యా సమన్వయకర్త ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి గిరిజన ఆవాస ప్రాంతాల్లోని నెమళ్లకుంట, నారపురెడ్డి కుంట పాఠశాలలను సందర్శించారు. వారి వెంట ఎంఈఓ మోహన్‌ రెడ్డి, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ రఫీ తదితరులు ఉన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి

నీటివిడుదల తగ్గింపు

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదలను 8వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 2,24,882 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో 884.40 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద 883.40అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్‌రెగ్యులేటర్‌ నాల్గవ గేటు నుంచి 1,500 క్యూసెక్కులు, ఎన్‌సీఎల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 3,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగకు 3వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్‌) కాల్వకు 1,000, కేసీ ఎస్కేప్‌ కాల్వకు 1,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

నంద్యాల: జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియాని జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నంద్యాల నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీల్‌ షెరాన్‌, కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో కలువలేకపోయారు. ఈ క్రమంలో ఎస్పీ కలెక్టర్‌కు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు.

నర్సాపురంలో డెంగీ కేసు 1
1/3

నర్సాపురంలో డెంగీ కేసు

నర్సాపురంలో డెంగీ కేసు 2
2/3

నర్సాపురంలో డెంగీ కేసు

నర్సాపురంలో డెంగీ కేసు 3
3/3

నర్సాపురంలో డెంగీ కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement