
స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు
దస్తావేజు రైటర్ల పెన్‌డౌన్‌తో ఒక్క రిజిస్ట్రేషన్ జరుగని వైనం
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగబోదన్న రైటర్లు
కర్నూలు(సెంట్రల్): దస్తావేజు రైటర్ల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించి పోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో ఎక్కడ కూడా ఒక్క రిజిస్ట్రేషన్ జరుగలేదు. ఫలితంగా నిత్యం క్రయ, విక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పి కనిపించా యి. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 500 రిజిస్ట్రే షన్‌ల వరకు జరుగుతాయి. ప్రభుత్వానికి దాదాపు రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఆదా యం వస్తుంది. అయితే దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా..విక్రయ దారులు ఇబ్బంది పడ్డారు. శనివారం కూడా పెన్‌డౌన్ కొనసాగుతుందని యూనియన్ నేతలు తెలిపారు.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ఎదుట ఆందోళన
కర్నూలులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకునే వరకు పోరాటం చేస్తామని యూనియన్ నాయకులు ఎస్‌ఏ రహమాన్, మహ్మద్ రఫీక్, చంద్రశేఖర్, రామకృష్ణ, నాగరాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే పీడీఈ విధానంలో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. ఆటో మ్యూటేషన్‌లో అనవసరపు నిబంధనలను తొలగించి తమపై పనిభారం తగ్గించాలన్నారు. స్లాట్ బుకింగ్‌లో విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఈ స్టాంపింగ్ విధానాన్ని రద్దు చేసి నాన్ జ్యూడిషియల్ స్టాంపులను అందుబాటులోకి తేవాలని కోరారు. నాయకులురాజా, మహేష్, గోపాల్, జగదీష్, భాస్కర్ గౌడ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు