
తామర.. సొగసు చూడ తరమా..!
చాకరాజువేముల శివారులో విరబూసిన తామ పూలు
పవిత్రత, స్వచ్ఛత, దైవత్వం, ప్రేరణకు చిహ్నంగా తామర పుష్పాలను భావిస్తారు. నీటి కొలనులో విరబూసే ఈ తామర పుష్పాలను అటు పూజల్లో, ఇటు ఆయుర్వేద వైద్యంలోనూ వినియోగిస్తారు. ఈ పుష్పాలకు ఉండే లక్షణాల బట్టి ఎంతో విశిష్టతగా పరిగణిస్తారు. చాకరాజువేముల, ఉమాపతినగరం, గుండుపాపల గ్రామా ల్లోని నీటికుంటల్లో తామర పూలు విరబూసి కనువిందు చేస్తున్నాయి. ఎంతో అందంగా కనిపిస్తూ తామర.. సొగసు చూడ తరమా అనేలా మనసు దోచేస్తున్నాయి. – దొర్నిపాడు

తామర.. సొగసు చూడ తరమా..!