
వీడని సందిగ్ధం.. తొలి విడతకు సమాయత్తం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది.
ఓట్ల లెక్కింపు,
ఫలితాల వెల్లడి :
నవంబర్ 11
మండలం ఎంపీటీసీ పోలింగ్
స్థానాలు కేంద్రాలు
నాగర్‌కర్నూల్ 14 70
తెలకపల్లి 14 89
తాడూరు 10 53
బిజినేపల్లి 21 117
తిమ్మాజిపేట 12 71
కల్వకుర్తి 11 60
ఊర్కొండ 6 32
వెల్దండ 11 61
వంగూరు 10 63
చారకొండ 6 41
మొత్తం 115 657
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రానికి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గురువారం ఉదయం 10.30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న అయోమయం ఆశావహుల్లో నెలకొంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పార్టీలు అభ్యర్థిత్వాలను పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నా ప్రధాన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపించడం లేదు.
జిల్లా పరిధిలో ఇలా..
మూడు రోజులే గడువు..
వీడని ఉత్కంఠ..
అన్ని అంశాలపై అవగాహన
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వీసీ నిర్వహించి తొలి విడతలో జరిగే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి అమలు, శాంతిభద్రతల పర్యవేక్షణ తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ వివరిస్తూ జిల్లాలో తొలి విడతలో 115 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవగాహన సైతం కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేటినుంచి నామినేషన్ల పర్వం
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ
ఈ నెల 11 వరకు తుది గడువు
అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ