
మహోన్నత వ్యక్తి సురవరం
కొల్లాపూర్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన జీవితం, ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని, పేదరికం లేని సమాజం కోసం తుదిశ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన ఆలోచనలు, లక్షణాలు, జీవన విధానాలను అనుసరించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బుధవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబీకులు, బంధువులు నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ కొల్లాపూర్‌లో సురవరం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కుచట్టం సాధించడంలో సురవరం పాత్ర ఎంతో ఉందన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తి.. ఆ సమస్యకు పరిష్కారం కోసం పోరాడిన గొప్ప నాయకుడు అన్నారు. తెలంగాణ సాధనలోనూ కూడా ఆయన పాత్ర ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సురవరం లాంటి గొప్ప నాయకుడిని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల పక్షాన తుదిశ్వాస విడిచే వరకు పోరాడారన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల ప్రజలకు సురవరం సుపరిచితుడని, మచ్చలేని నాయకుడు అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా లో జాతీయ రహదారి లేదా ప్రాజెక్టుకు సురవరం పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సుధాకర్‌రెడ్డి కుటుంబంతో తమకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన జీవితంతో పా టు దేహాన్ని కూడా సమాజం కోసం త్యాగం చేశారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి, సోదరి పుష్పలత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్‌నర్సింహ, జిల్లా కార్యదర్శి ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావు, నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణ్‌రావు, వెంకటేష్, ఏసయ్య, హుస్సేనయ్య, వరదారెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు