విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Oct 8 2025 8:30 AM | Updated on Oct 8 2025 2:26 PM

వెల్దండ/చారకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని డీఈఓ రమేశ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం అజిలాపూర్‌, చారకొండ మండలం జూపల్లి పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతం పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. 

అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. సబ్జెక్టుల వారీగా ప్రయోగాత్మక పద్ధతులతో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని.. తద్వారా విద్యాప్రమాణాలు పెంపొందుతాయని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈఓ వెంట జిల్లా టెస్టు బుక్స్‌ మేనేజర్‌ నర్సింహులు, హెచ్‌ఎంలు అంజయ్య, డేవిడ్‌రాజు ఉన్నారు.

సీజేఐపై దాడి హేయనీయం

నాగర్‌కర్నూల్‌ క్రైం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడికి యత్నించడాన్ని ఖండిస్తున్నట్లు నాగర్‌కర్నూల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవికాంత్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది దాడికి యత్నించడం హేయనీయమన్నారు. న్యాయమూర్తిపై జరిగిన దాడిని ప్రతి న్యాయవాది ఖండించాలని అన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మదుసూధన్‌రావు ఉన్నారు.

మద్యం టెండర్లపై ఎన్నికల ఎఫెక్ట్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: మద్యం దుకాణాల టెండర్లపై స్థానిక ఎన్నికల ప్రభావం అధికంగా పడుతుందనే చర్చ సాగుతోంది. మరోవైపు దరఖాస్తు ఫీజు సైతం రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా చాలా మంది స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల టెండర్లు వేద్దామా.. లేక ఎన్నికల బరిలో ఉందామా అనే ఆలోచనలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టెండర్ల ప్రక్రియ మొదలైన మొదటివారం నుంచే దరఖాస్తుల హడావుడి కనిపించేది. కానీ ఈసారి ఊహించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి 11 రోజుల వ్యవధి ఉన్న క్రమంలో చివరి వారం రోజుల్లో వేగం పుంజుకుంటుందా.. లేక ఇలాగే ఉంటుందోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

అయితే చివరి నాలుగు రోజుల్లో భారీగా టెండర్లు రావొచ్చనే ధీమాలో ఎకై ్సజ్‌ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోతే ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేకపోలేదు. కాగా.. ఉమ్మడి జిల్లాలో మంగళవారం 13 టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7, నారాయణపేటలో 3, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3 దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 40 టెండర్లు మాత్రమే దాఖలు కావ డం విశేషం. మద్యం అమ్మకాలు గణనీయంగా ఉండే జోగుళాంబ గద్వాల జిల్లాలో వ్యాపారులు టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి 1
1/1

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement