
విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు
కందనూలు: విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు.పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘ నాయకులు ఉన్నారు.