
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు
అచ్చంపేట: ప్రజాపాలనలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలు ప్రతి గడపకు చేరాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌లో వంగూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, గ్రామ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్, నాయకులు అల్వాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, సురేందర్ రెడ్డి జంగయ్య, తిరుమలయ్య, హరీశ్‌రెడ్డి ఉన్నారు.
నేడు ఫుట్‌బాల్ జట్టు
ఎంపిక
జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలను మంగళవారం జడ్చర్లలోని మినిస్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డా.శారదాబాయి తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్, బోనఫైడ్ జిరాక్స్‌లతో రావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు మిని స్టేడియంలో రిపోర్టు చేయాలని, ఇతర వివరాలకు 9985375737 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రేపు ఉమ్మడి జిల్లా
కబడ్డీ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు నాలుగు ఎలిజిబిలిటి ఫారాలతో ఉదయం 9 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌కు రిపోర్టు చేయాలని ఆమె సూచించారు.