
అంతా ఇష్టారాజ్యం!
మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
నామమాత్రపు చర్యలు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
ఎక్కడ?
జీ ప్లస్–1కే అనుమతులు..
నోటీసులిచ్చి వసూళ్ల పర్వం..
కనిపించని ‘టెండర్ల’ జోరు
● మద్యం దుకాణాల కోసంఇప్పటి వరకు 27 దరఖాస్తులు
● వనపర్తి, గద్వాల జిల్లాలో ప్రారంభం కానీ వైనం
మహబూబ్‌నగర్ క్రైం: సాధారణంగా మద్యం దుకాణాలు అంటే విపరీతమైన డిమాండ్‌తో పాటు వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 227 మద్యం దుకాణాలకు టెండర్ల జోరు పెరగడం లేదు. కొత్త దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై పది రోజులు దాటినా.. వ్యాపారులు ఇంకా టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. మరి టెండర్ ఫీజు పెంచడం కారణమా? లేక చివరి వారం రోజుల కోసం ఎదురుచూస్తున్నారో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 18 వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. మంచి ముహూర్తం చూసుకొని టెండర్లు వేయాలని కొందరు వ్యాపారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఒకటి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 11 టెండర్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 21, మహబూబ్‌నగర్‌లో 5, నారాయణపేటలో ఒక దరఖాస్తుతో కలిపి మొత్తం 27 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు టెండర్ల ఖాతా ప్రారంభం కాలేదు.
పట్టణాల్లో నిర్మాణ స్థలానికి అనుగుణంగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు మంజూరు చేస్తారు. కొందరు జీ ప్లస్–1 నిర్మాణానికి అనుమతి తీసుకొని జీ ప్లస్–2 నుంచి 5 వరకు నిర్మిస్తున్నారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ ప్లస్–1, 200 గజాల పైగా స్థలం ఉంటే జీ ప్లస్–2, 500 గజాల స్థలం ఉంటే జీ ప్లస్–4 వరకు అనుమతులు మంజూరు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు టీఎస్ బీపాస్ ద్వారా ఇళ్లు, దుకాణాల అనుమతులను ఒక విధంగా పొంది.. మరో విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా రోడ్లకు 5 ఫీట్ల దూరం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి 3 ఫీట్ల దూరం ఉండేలా నిర్మించాల్సి ఉన్నా అనేక చోట్ల విస్మరిస్తున్నారు. అగ్గిపెట్టె మాదిరిగా కడుతున్న భవనాల వద్ద ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్కింగ్ స్థలాలు వదలకపోవడం.. రహదారులపై ర్యాంపులు నిర్మించడం.. రోడ్లను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే, వాణిజ్య భవనాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన సెల్లార్లను కమర్షియల్ షటర్లుగా వినియోగిస్తున్నారు.
అచ్చంపేట: మున్సిపాలిటీలు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతున్నాయి. కొందరు రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీ చూడనట్టు వ్యవరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లను అనుసరించి చేపట్టే నిర్మాణాలు సెట్‌బ్యాక్ లేకుండా, ఏ విధమైన అనుమతులు లేకుండానే భవనాలు వెలుస్తున్నా పట్టించుకోక పోవడంతో పాటు ఎవరైనా పిర్యాదు చేస్తే కంటితుడుపుగా నోటీసులు ఇచ్చి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా చేపడుతున్న భవనాల నిర్మాణంతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి పడుతోంది. ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు నామమాత్రపు చర్యలు మాత్రమే చేపడుతున్నారు. అచ్చంపేట మల్లంకుంట బంఫర్ జోన్‌లో నిర్మించిన దుకాణాలను సగం మాత్రమే కూల్చివేసి చేతులు దులుపుకొన్నారు. కొల్లాపూర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేయగా.. కల్వకుర్తిలో సెల్లార్‌ను మూసివేశారు. అదే విధంగా జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో బంఫర్ జోన్‌లో నిర్మించిన భవనాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. పలుకుబడి ఉన్న వారిపై చర్యలు తీసుకోకపోగా.. అమాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డకట్ట వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటుచేసింది. జిల్లాలో నాలుగు బృందాలను ఏర్పాటుచేయగా.. అక్రమ నిర్మాణాలను పట్టించుకున్న దాఖలు లేవు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల ఫైరవీలతో వీటి లక్ష్యం నీరుగారుతోంది. ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు లేని నిర్మాణాలపై అధికార, ప్రతిప్రక్ష పార్టీల నాయకులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగంగా చర్చింకుంటున్నారు.
అచ్చంపేటలో వెలసిన అక్రమ నిర్మాణాలు మచ్చుకు కొన్ని..
అనుమతులు లేకుండా
ఇష్టానుసారంగా కట్డడాలు
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న
అధికారులు
ఫిర్యాదులు వస్తేనే స్పందన..
ఆపై నోటీసులతోనే సరి
అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో జీ ప్లస్–1కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. జీ ప్లస్–2, 3, 4, 5 సెల్లార్లకు ఎలాంటి అనుమతులు లేవు. మేజర్ పంచాయతీల సమయంలో కొన్ని నిర్మాణాలు జరిగాయి. అనుమతులు లేని కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. వీటిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– మనోజ, టౌన్ ప్లానింగ్ అధికారి, అచ్చంపేట
అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎక్కడైనా నిర్మాణం జరుగుతుంటే అక్కడికి వెళ్లి ముందుగా నోటీసులు ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చంపేటలో ఇప్పటి వరకు 40 నుంచి 60 నోటీసులు జారీ చేసి.. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. సీజింగ్ ఆర్డర్ ఇచ్చిన వాటిని కూడా సీజ్ చేయలేదు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల జోక్యంతో కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు కిందిస్థాయి సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. గోడల నిర్మాణం చేపట్టిన వెంటనే తెల్లరంగు వేయాలని అక్రమ నిర్మాణదారులకు అధికారులే సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన వెంటనే ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారని తెలిసింది.

అంతా ఇష్టారాజ్యం!

అంతా ఇష్టారాజ్యం!

అంతా ఇష్టారాజ్యం!