
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
తిమ్మాజిపేట: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేట కేజీబీవీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంటగదిలో వండేందుకు సిద్ధంగా ఉన్న కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను డీఈఓ పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి..పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విధంగా పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధులతో చేపడుతున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులను డీఈఓ పరిశీలించారు.